ఫలిష్తీయులు-మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మేదని వారినడుగగా వారు-మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక , ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.
కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను . అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.