అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను ; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా
నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.
నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను