దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను ; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి -నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా
దావీదు -రాజు నాకు ఒక పని నిర్ణయించి -నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్ప వద్దనెను ; నేను నా పనివారిని ఒకా నొక చోటికి వెళ్ల నిర్ణయించితిని ;
నీ యొద్ద ఏమి యున్నది ? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండిన యెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా
యాజకుడు -సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు ; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను .
అందుకు దావీదు -నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పనివారి బట్టలు పవిత్రములే ; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను .
అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేక పోగా , వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతని కిచ్చెను .
ఆ దినమున సౌలుయొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను ; అతని పేరు దోయేగు , అతడు ఎదోమీయుడు . అతడు సౌలు పసుల కాపరులకు పెద్ద
రాజు పని వేగిరముగా జరుగవలెనని యెరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తే లేదు . ఇక్కడ నీయొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా
యాజకుడు -ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది , అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునులేదు , దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదు -దానికి సమమైనదొకటియు లేదు , నా కి మ్మనెను .
నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడుచున్నాము