యోనాతాను -ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయ మైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా
అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక . యెహోవా నా తండ్రికి తోడుగా ఉండి నట్లు నీకును తోడుగా ఉండునుగాక .