అగుపరుచుకొందము
న్యాయాధిపతులు 7:9-14
9

ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను.

10

పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతో కూడ దండుకు దిగిపొమ్ము.

11

వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.

12

మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.

13

గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగానేనొక కలగంటిని, అదేమనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను.

14

అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.