సమూయేలు వృద్ధుడై నప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను .
ఈలాగున చెప్పెను -మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివా డగుననగా , అతడు మీ కుమారులను పట్టుకొని , తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును , కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు .