సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను ; సౌలు తనయొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి .
సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితో కూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి ; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి .
అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు
వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు.