ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను . ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిది వరకు ఏరుకొను చుండెను , కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.
అప్పుడు బోయజు రూతు తో నా కుమారీ , నా మాట వినుము ; వేరొక పొలములో ఏరుకొనుటకు పో వద్దు , దీనిని విడిచి పో వద్దు , ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.
అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారీ , అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను .
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను?
నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.