అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగానుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను.కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.
సహోదరులు కూడి నివసించుచుండగా వారిలోఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.