అతని యెదుట నిలువలేక పారిపోయెను
1 రాజులు 20:18-21
18

అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను.

19

రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి

20

ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను.

21

అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.

1 రాజులు 20:30-21