రిమ్మోను
యెహొషువ 15:32

సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నియు ఇరువది తొమి్మది.

1దినవృత్తాంతములు 6:77

మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూలూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు,

జెకర్యా 14:10

యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును ,హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును , మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశ మంతయు మైదానముగా ఉండును ,