యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.
న్యాయాధిపతులు 1:21

యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీయులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు.

యెహొషువ 15:63

యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.