ఆషే రీయులు
యెహొషువ 19:24-30
24

అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను.

25

వారి సరిహద్దు హెల్కతు హలి బెతెను అక్షాపు

26

అలమ్మేలెకు అమాదు మిషెయలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి

27

తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కున పోవుచు

28

ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.

29

అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.

30

ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.