హాయియొద్దకు తిరిగివచ్చి
యెహొషువ 10:30-41
30

యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను.

31

అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా

32

యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.

33

లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.

34

అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి

35

ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారి నందరిని ఆ దినము నిర్మూలముచేసెను.

36

అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి

37

దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను.

38

అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి

39

దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.

40

అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.

41

కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను.

యెహొషువ 11:10-14
10

ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్తరాజ్యములకు ప్రధానము.

11

ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను.

12

యెహోషువ ఆ రాజులనందరిని హతముచేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను; యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను.

13

అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెనుగాని మెట్టలమీద కట్టబడియున్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు.

14

ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండ అందరిని నశింపజేయువరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి.

సంఖ్యాకాండము 21:24

ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది.