ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచి
వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు
అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను.
వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను
జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.
అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు.