గోలానును
యెహొషువ 20:8

తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములోనుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.

ద్వితీయోపదేశకాండమ 1:4

నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను.

ద్వితీయోపదేశకాండమ 4:43

అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.

1దినవృత్తాంతములు 6:71

మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,