కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.
యెహొషువ 21:5

కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి పది పట్టణములు.

1దినవృత్తాంతములు 6:66

కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.