బహుదినములు
యెహొషువ 11:23

యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రములచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్పగించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను.

యెహొషువ 14:7-10
7

దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని.

8

నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని.

9

ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండుననెను.

10

యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటినుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను.