ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.
హెబ్రీయులకు 7:15

మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,

హెబ్రీయులకు 7:21

వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవైయున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;

హెబ్రీయులకు 5:6

ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవైయున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 5:10

తనకు విధేయులైనవారికందరికిని నిత్యరక్షణకు కారకుడాయెను.

హెబ్రీయులకు 6:20

నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

కీర్తనల గ్రంథము 110:4

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు , ఆయన మాట తప్పనివాడు.