ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
పరిసయ్యులదిచూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.
ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లుచుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి.
అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా