ఆ స్త్రీ -నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు-సమూయేలును రప్పింపవలె ననెను .
ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి -నీవు సౌలువే ; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలు తో చెప్పగా
రాజు -నీవు భయపడ వద్దు , నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె-దేవతలలో ఒకడు భూమి లోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నా ననెను .
అందుకతడు-ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది-దుప్పటి కప్పుకొనిన ముసలివా డొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.