నాకు బహు దుఃఖమును , నా హృదయములో మానని వేదనయు కలవు .
క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయపడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.
నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.