వెళ్లను
గలతీయులకు 1:18

అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.

అపొస్తలుల కార్యములు 9:20-25
20

వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచువచ్చెను.

21

వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.

22

అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.

23

అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా

24

వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి

25

గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.

తిరిగి వచ్చితిని
2 కొరింథీయులకు 11:32

దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.

2 కొరింథీయులకు 11:33

అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.