
ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండగోరుచున్నాను.
కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను.
నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణకద్దు.
కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.
కాబట్టి యిప్పుడు మీ పితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనియుండుడి.
అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.
అయితే జనులు అనేకులైయున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను,
మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగిపోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను.
అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులైయుండిరి.
చెరనుండి విడుదలనొందినవారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరులనుబట్టి తమ తమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి.
మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లిచేసికొనినవారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.
యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొనియున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.
వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులైయున్నందున అపరాధవిషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.