దాసులై యున్నప్పుడు
రోమీయులకు 6:16

లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో , అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసుల గుదురని మీరెరుగరా ?

రోమీయులకు 6:17

మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో , దానికి హృదయ పూర్వకముగా లోబడినవారై ,

యోహాను 8:34

అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.