vexed
మత్తయి 15:22

ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

మత్తయి 17:15

ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్ని లోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;

అపొస్తలుల కార్యములు 5:16

మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడినవారిని మోసికొనికూడివచ్చిరి. వారందరు స్వస్థతపొందిరి.