అందుకాయన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా
వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల--ఆలాగైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.
ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు మని
ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.
దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను.