అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.
మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు
శోకో దన్నా కిర్యత్సన్నా
అను దెబీరు అనాబు ఎష్టెమో
ఆనీము గోషెను హోలోను గిలో అనునవి,
వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు.
ఆరాబు దూమా ఎషాను
యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమి్మది పట్టణములు.
మాయోను కర్మెలు జీఫు యుట్ట యెజ్రెయేలు
యొక్దెయాము జానోహ
కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.
హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు
బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణములను ఇచ్చిరి.
అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది.
యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.