అది కొర్బాను
మత్తయి 15:5

మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు.

మత్తయి 23:18

మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.

1 తిమోతికి 5:4-8
4

అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటి వారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.

5

అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి , దేవుని మీదనే తన నిరీక్షణనుంచుకొని , విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయిం బగలు నిలుకడగా ఉండును.

6

సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదై యుండును.

7

వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము

8

ఎవడైనను స్వకీయులను , విశేషముగా తన యింటివారిని , సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.