తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
ఆయన సమాజమందిరము లోనుండి లేచి , సీమోను ఇంటి లోనికి వెళ్లెను . సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి .
ఆయన ఆమె చెంతను నిలువబడి , జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను ; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను .
అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.