ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.
సంఖ్యాకాండము 3:41

నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగ పిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలొ తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను.

సంఖ్యాకాండము 3:45

నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నా వారైయుందురు; నేనే యెహోవాను.

సంఖ్యాకాండము 8:16

ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.

సంఖ్యాకాండము 8:18

ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను.

సంఖ్యాకాండము 18:6

ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొనియున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు.