సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్కచొప్పున నీ పొరుగువానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.
ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా.
దానిని అమి్మనది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.
ఇంక అనేక సంవత్సరములు మిగిలి యుండినయెడల వాటినిబట్టి తన్ను అమి్మన సొమ్ములో తన విమోచనక్రయధనమును మరల ఇయ్యవలెను.
సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన యెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను.