అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.
లేవీయకాండము 25:6

అప్పుడు భూమియొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును.

లేవీయకాండము 25:7

మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంటఅంతయు మేతగా ఉండును.