యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను -ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము . యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును , ఇశ్రాయే లువారికి రాజ్యముండకుండ తీసివేతును .
యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశము లోనుండి బయలుదేరుదురు ; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును .