నీ రాజ్యములో ఒక మనుష్యు డున్నాడు . అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు ; నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను .
ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును , మర్మములు బయలుపరచుటకును , కఠినమైన ప్రశ్నల కుత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము , అతడు దీని భావము నీకు తెలియజెప్పును .