
మా పితరుల దేవా , నీవు వివేకమును బలమును నాకనుగ్రహించియున్నావు ; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను ; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను.
ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్లి బబులోనులోని జ్ఞానులను నశింపజేయ వద్దు , నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెద ననెను .