
నేను కన్ను లెత్తి చూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.
అతనిశరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱ చేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి
అప్పుడు నర స్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగి నందున నా బలము తొలగిపోయెను,
మొదటి నెల యిరువది నాలుగవ తేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.