రాజును
దానియేలు 11:8

మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.

దానియేలు 11:9

అతడు దక్షిణదేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును.

దానియేలు 11:11

అంతలో దక్షిణదేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపు రాజు తో యుద్ధము జరిగించును; ఉత్తరదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.

దానియేలు 11:14

ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజు తో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.

దానియేలు 11:25

అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజు తో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయ నుద్దేశించినందున ఆ రాజు నిలువ లేకపోవును.

దానియేలు 11:40

అంత్య కాలమందు దక్షిణదేశపు రాజు అతనితో యుద్ధముచేయును. మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీద పడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.

ఒకడును
దానియేలు 11:3

అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.

దానియేలు 11:4

అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలు దిక్కుల విభాగింపబడును. అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.