జెబూలూనీయులకు
ఆదికాండము 30:19

లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.

ఆదికాండము 30:20

అప్పుడు లేయా - దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.

యెహొషువ 19:10-16
10

మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.

11

వారి సరిహద్దు పడమటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి

12

శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి

13

అక్కడనుండి తూర్పుతట్టు గిత్తహెపెరువరకును ఇత్కాచీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.

14

దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.

15

కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.

16

ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము.