
అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.
మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువది యైదు మూరలు
చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు,వెడల్పు అయిదు మూరలు.
దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను; దాని స్తంభముల మీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.