మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి , నీతి న్యాయములను అనుసరించుచు
మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును .
అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును .