అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు.
ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును.