the anointing
నిర్గమకాండము 30:23-33
23

పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున , అచ్చమైన గోపరసము ఐదు వందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము , అనగా రెండువందల ఏబది తులముల యెత్తును

24

నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదు వందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని

25

వాటిని ప్రతిష్ఠా భిషేక తైలము , అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభారముగా చేయవలెను . అది ప్రతిష్ఠా భిషేక తైల మగును .

26

ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును

27

బల్లను దాని ఉపకరణము లన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూప వేదికను

28

దహన బలిపీఠమును దాని ఉపకరణము లన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి

29

అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను . వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును .

30

మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులైయుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను .

31

మరియు నీవు ఇశ్రాయేలీ యులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠా భిషేక తైలమై యుండవలెను ;

32

దానిని నర శరీరము మీద పోయ కూడదు ; దాని మేళనము చొప్పున దాని వంటిదేనినైనను చేయ కూడదు . అది ప్రతిష్ఠితమైనది , అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను .

33

దానివంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజల లోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము .

నిర్గమకాండము 37:29

అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.

పరిమళ ధూపద్రవ్యము
నిర్గమకాండము 30:34-38
34

మరియు యెహోవా మోషే తో ఇట్లనెను నీవు పరిమళ ద్రవ్యములను , అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని

35

వాటితో ధూపద్రవ్యమును చేయవలెను ; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి , ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.

36

దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను . అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను .

37

నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొన కూడదు . అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను .

38

దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును .