కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు
కీర్తనల గ్రంథము 42:3

నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.

కీర్తనల గ్రంథము 102:9

నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను .

యోబు గ్రంథము 6:7

నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.

యెషయా 30:20

ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

యెహెజ్కేలు 4:16

నర పుత్రుడా , ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు , నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు .

యెహెజ్కేలు 4:17

అన్న పానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకని నొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు .