సీయోనులోనుండి
కీర్తనల గ్రంథము 76:2

షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.

కీర్తనల గ్రంథము 134:3

భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.

2 దినవృత్తాంతములు 6:6

ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.

యెరూషలేములో నివసించు
కీర్తనల గ్రంథము 48:1

మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు.

కీర్తనల గ్రంథము 48:9

దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితివిు.

కీర్తనల గ్రంథము 132:13

యెహోవా సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొనియున్నాడు.

కీర్తనల గ్రంథము 132:14

ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను

యెషయా 12:6

సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.