understanding
యోబు గ్రంథము 34:2

జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి

యోబు గ్రంథము 34:4

న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసికొందము రండి.

యోబు గ్రంథము 34:10

విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

యోబు గ్రంథము 34:16

కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.

1 కొరింథీయులకు 10:15

బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి