అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరక పోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను.
ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువులనందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.
అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి
యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరని వారి నడుగగా వారు మేము అహజ్యా సహోదరులము ; రాజ కుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి .
వారిని సజీవులగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులగా పట్టుకొని యొకనినైన విడు వక గొఱ్ఱె వెండ్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి .