అహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను; అతని తల్లి ఒమీ కుమార్తె, ఆమె పేరు అతల్యా
దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతివారి మార్గములందు నడచెను.
అహాబు సంతతివారివలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశమునకు కారుకులైరి.
అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి ... బొందెనని తెలిసికొని లేచి రాజ కుమారుల నందరిని నాశనము చేసెను.