మెరీబ్బయలు
2 సమూయేలు 4:4

సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు.

2 సమూయేలు 9:6

సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతూ అని అతని పిలిచినప్పుడు అతడుచిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.

2 సమూయేలు 9:10

కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి.

2 సమూయేలు 19:24-30
24

మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.

25

రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతూ, నీవు నాతో కూడ రాకపోతివేమని అతని నడిగెను

26

అందుకతడు నా యేలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిదమీద గంత కట్టించి యెక్కి రాజుతో కూడ వెళ్లిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను.

27

సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా యేలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా యేలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటివాడవు, నీ దృష్టికి ఏది యనుకూలమో దాని చేయుము.

28

నా తండ్రి యింటి వారందరు నా యేలినవాడవును రాజవునగు నీ దృష్టికి మృతుల వంటివారై యుండగా, నీవు నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజవైన నీకు మొఱ్ఱపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా

29

రాజు నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేనాజ్ఞ ఇచ్చితిని గదా అనెను.

30

అందుకు మెఫీబోషెతు నా యేలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసికొనవచ్చుననెను.

Mephibosheth
2 సమూయేలు 9:12

మెఫీబోషెతునకు ఒకచిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్న వారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి.