లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కనిపెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు
కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.
వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికులనుండియు, షిమ్యోను గోత్రికులనుండియు, బెన్యామీను గోత్రికులనుండియు చీట్లవలన వచ్చినవి పదమూడు పట్టణములు.
కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి పది పట్టణములు.
కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.
నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును గెజెరును దాని పొలమును
కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.
దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును
అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.
రెండు పట్టణములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి.
వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.